సీనియర్ల బ్లాక్ మెయిల్: గోనె
హైదరాబాద్: తెలంగాణ పేరుతో తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు గోనె ప్రకాశరావు విమర్శించారు. 2001 తర్వాత జరిగిన ఎన్నికల ఫలితాలను తాను తమ పార్టీ శాసనసభ్యులతో, ఎమ్మెల్సీలతో కలిసి పార్టీ అధిష్ఠానవర్గానికి వివరిస్తానని ఆయన చెప్పారు. కరీంనగరులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలిచినంత మాత్రాన తెలంగాణ రాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
2001 తర్వాత జరిగిన ఎన్నికల్లో తెరాస చిత్తుగా ఓడిపోయినప్పుడు తెలంగాణ సెంటిమెంటు ఏమైందని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ నియోజరవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పది వేల మెజారిటీ వచ్చిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications