హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వదిలేసిన తర్వాత తాను మాట్లాడటం సరి కాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. తమ పార్టీ నాయకులకు సోనియా గాంధీపై నమ్మకం లేదా అని ఆయన ఆదివారంనాడు ప్రశ్నించారు. ప్రాంతీయ బోర్డులకు నిధులు కేటాయించడం లేదనే తెలంగాణ ప్రాంతీయ బోర్టు చైర్మన్ ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి విమర్శపై తాను బహిరంగంగా స్పందించబోనని ఆయన చెప్పారు.
వచ్చే బడ్జెట్ లో కూడా సాగునీటి ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని ఆయన చెప్పారు.