రాజగోపాల్ తెలంగాణ విలన్: సర్వే
మెదక్: తెలంగాణపై తెలంగాణేతరులు మాట్లాడితే తెలంగాణ ప్రజలు చెప్పుదెబ్బలు కొడతారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ తమ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను హెచ్చరించారు. తెలంగాణలో తెలంగాణేతరులు పోటీ చేస్తే తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ల్యాంకో హిల్స్ పేరుతో రాజగోపాల్ కోట్లాది రూపాయల విలువ చేసే తెలంగాణ భూములను కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ పట్ల రాజగోపాల్ విలనుగా వ్యవహరిస్తున్నారని, సినిమాల్లో రాజనాల పాత్రలు పోషించిన పాత్రలను కాంగ్రెస్ పట్ల రాజగోపాల్ పోషిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications