తిరుపతి: జాతీయ పతాకాన్ని అవమానించిందంటూ హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాపై నమోదైన కేసు దర్యాప్తును వెంటనే చేపట్టాలని తిరుపతి మూడో అదనపు మెజిస్ట్రేట్ చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ)ని ఆదేశించింది. ఈ నెల 18వ తేదీన తుది నివేదిక సమర్పించాలని కూడా కోర్టు ఎస్పీని ఆదేశించింది.
జాతీయ పతాకాన్ని అవమానించిందంటూ సానియా మీర్జాపై తిరుపతికి చెందిన ఒక న్యాయవాది కోర్టులో కేసు వేశారు. సానియా మీర్జా కూర్చున్న తీరు జాతీయ పతాకాన్ని అవమానించేదిగా ఉందని ఆయన ఆరోపించారు.