ఇది కాంగ్రెస్ కుట్ర: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణవాదాన్ని పక్కదోవ పట్టించడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఈ కుట్రలో భాగంగానే తమ పార్టీ కార్యకర్తలు మంత్రి ఫరీదుద్దీన్ పై దాడి చేశారని ఆరోపిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ఫరీదుద్దీన్ పై దాడి చేసింది తమ పార్టీ కార్యకర్తలు కాదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గతంలో ఆ విధమైన దాడులు చేయించిన చరిత్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి ఫరీదుద్దీన్ పై దాడి ఘటనలో తమ కార్యకర్తలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గత ఆరున్నరేళ్లుగా తాము శాంతియుత పద్ధతిలో ఉద్యమాన్ని నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణవాదాన్ని తట్టుకోలేక తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే తమపై కాంగ్రెస్ వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications