విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నిర్వాసితుల ఆందోళన ఉధృత రూపం దాల్చింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు పరిపాలనా భవనం ముందు ధర్నాకు దిగారు. పరిపాలనా భవనంలోకి దూసుకెళ్లడానికి వారు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు.
ఆందోళనకు దిగిన 400 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నిర్వాసితులు చాలా కాలంగా ఆందోళనకు దిగారు.