మహిళపై చిరుత దాడి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడలో ఒక మహిళపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో వసంతకుమారి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆమె మాట్లాడలేకపోతోంది. విశాఖపట్నం జిల్లాలోని రుషికొండ ప్రాంతంలో మూడు నాలుగు చిరుతలు సంచరిస్తున్నాయి. ఇంతకుముందు చిరుతలు ఒక యువకుడిపై దాడి చేశాయి.
వసంతకుమారిపై చిరుత దాడి చేయడం గమనించిన స్థానికులు రాళ్లు రువ్వారు. దీంతో చిరుత ఆమెను వదిలిపెట్టింది. ఆమెను తీసుకుని వస్తుండగా మరోసారి చిరుత దాడి చేసింది. మళ్లీ చిరుతను రాళ్లతో తరిమేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications