బాలికపై సామూహిక అత్యాచారం
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కాపాడేందుకు శాసనసభ్యుడొకరు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 17 ఏళ్ల బాలికపై శాసనసభ్యుడి వాహనం డ్రైవర్, అనుచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాలిక మానసిక స్థితి బాగా లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ వాతావరణంలో బాలిక తల్లి తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. ప్రేమ పెళ్లి జరిపించాలంటూ ఆ బాలిక శాసనసభ్యుడి శరణు వేదినట్లు, అయితే మేజర్ అయితే సమస్య ఉండదని ఆ ఎమ్మెల్యే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే వద్దకు వచ్చినప్పుడే ఆ బాలికపై వారు కన్నేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
