తెలంగాణ ఇస్తే తప్పుకుంటా: కాకా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇస్తే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి (కాకా) చెప్పారు. తనకు గవర్నర్ పదవి ఇస్తారని వస్తున్న ఊహాగానాలను ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. గవర్నర్ పదవి ఇచ్చినా తాను తీసుకోనని ఆయన చెప్పారు. తనకు పదవులు అక్కర్లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం గతంలో కన్నా సీరియస్ గా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ అవసరం లేదని సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవడం ఆ సీరియస్ నెస్ ను తెలియజేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం గతంలో కన్నా తీవ్రంగా తాము పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ నివేదిక ఇవ్వగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని, ఇది త్వరలోనే అవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications