రాజకీయాలు చిరు వ్యక్తిగతం: నాగబాబు
మొగల్తూరు: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశంపై ఆయన సోదరుడు నాగబాబు ఆదివారంనాడు తమ స్వగ్రామం మొగల్తూరులో మంతనాలు జరిపారు. సీతారాంపురంలోని తోటలో ఆయన చిరంజీవి అభిమానులతో రహస్య చర్చలు జరిపారు. రాజకీయ రంగ ప్రవేశం చిరంజీవి వ్యక్తిగత నిర్ణయమని, దాని గురించి తానేమీ చెప్పలేనని ఆయన అన్నారు.
అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని, కుల సమీకరణలకు పోవద్దని ఆయన చిరంజీవి అభిమానులకు హితవు చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలు ఎంత పెంచితే అంత మంచిదని ఆయన చెప్పారు. నర్సాపురం నుంచి ఈ సమావేశానికి పెద్ద యెత్తున అభిమానులు తరలివచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాలను పెంచడానికే ఈ చర్చలు జరుపుతున్నట్లు నాగబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications