హంతకులకు వైయస్ అండ: బాబు
హైదరాబాద్: హంతకులకు, రేపిస్టులకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కొమ్ము కాస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. విజయవాడలో దారుణ హత్యకు గురైన విద్యార్థిని అయేషా తల్లిదండ్రులు బుధవారంనాడు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం సాగుతోందని ఆయన అన్నారు.
అయేషా హత్య కేసులో నిందితులను పట్టుకునే వరకు తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అయేషా తల్లిండ్రులు చంద్రబాబును కోరారు. మైనారిటీల సంక్షేమానికి ఎంతో చేస్తామని చెబుతున్న ప్రభుత్వం తమ కూతురు దారుణ హత్యకు గురైతే నిందితులను పట్టుకోవడం లేదని వారు విమర్శించారు. వారు చెప్పిందంతా చంద్రబాబు ఓపికగా విన్నారు. అయేషా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని, రాజకీయ జోక్యం వల్లనే పోలీసులు నిందితులను అరెస్టు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications