5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, కుబేర యోగం!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, వాటి స్థాన మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. జాతకంలో గ్రహాల అనుకూలత ఉంటే.. సామాన్యుడు సైతం రాత్రికి రాత్రే అపర కుబేరుడిగా మారిపోవచ్చని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఛాయా గ్రహాలు రాహు-కేతువుల సంచారం జరగబోతోంది. ఈ మహా సంచార ప్రభావంతో మొత్తం 12 రాశుల జీవితాల్లో కీలక మార్పులు రానున్నప్పటికీ.. ప్రత్యేకంగా ఐదు రాశుల వారికి మాత్రం ఊహించని అదృష్టం, అపార ధనలాభం, అఖండ విజయాలు దక్కబోతున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
డిసెంబర్ 5న ఏం జరగబోతోంది?
సాధారణంగా రాహు-కేతువులు ఎల్లప్పుడూ వక్ర మార్గంలో ప్రయాణిస్తూ, ప్రతి 18 నెలలకు ఒకసారి రాశి మారుతుంటారు. ఈ క్రమంలోనే రాబోయే డిసెంబర్ 5వ తేదీన ఒక మహా అద్భుతం జరగనుంది. రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనుండగా.. అదే రోజున కేతువు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు.

మేష రాశి
రాహువు మీ జాతకంలో కర్మ స్థానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీనివల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ విజయ యాత్ర మొదలవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. ఉన్నత పదవులు వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, మేనేజ్‌మెంట్ రంగాల్లో ఉన్నవారికి ఇది తిరుగులేని సమయం. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి రాహువు 5వ స్థానంలో, కేతువు లాభ స్థానమైన 11వ స్థానంలో కొలువుదీరబోతున్నారు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి ఊపందుకుంటుంది. ఊహించని మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. మీలో కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరుగుతాయి. మీ నైపుణ్యాల కారణంగా పని చేసే చోట బాస్‌ల నుంచి ప్రత్యేక ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి.
మీన రాశి
మీన రాశి వారికి రాహువు నేరుగా ఆదాయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆర్థిక పరంగా దీన్ని మీకు అత్యంత లాభదాయకమైన గోచారంగా చెప్పవచ్చు. మీ ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా పెరుగుతాయి. చాలా కాలంగా మనసులో ఉన్న బలమైన కోరికలు, ఆశయాలు నెరవేరే సమయం వచ్చింది. సమాజంలో అగ్ర శ్రేణి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ నెట్‌వర్క్ విస్తరించడం వల్ల భవిష్యత్తులో అపారమైన లాభాలను సొంతం చేసుకుంటారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి రాహువు 9వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహాల అనుకూలత మీ అదృష్టాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు చాలా సులభంగా ముగుస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి, ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా కలిసివస్తుంది. వ్యాపార విస్తరణకు, ఉద్యోగులకు ప్రమోషన్లు రావడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి రాహువు 6వ స్థానంలో, కేతువు 12వ స్థానంలో గోచరించనున్నారు. ఈ స్థాన చలనం మీకు అన్ని విధాలా మేలు చేస్తుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. కోర్టు వివాదాలు, ఆఫీసులో ఉండే రాజకీయాలు లేదా శత్రువుల ఇబ్బందుల నుంచి విజయం సాధిస్తారు. విదేశీ వ్యాపారాలు లేదా విదేశీ సంబంధాల ద్వారా ఆకస్మిక లాభాలు పొందుతారు.














Click it and Unblock the Notifications