గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఈకేవైసీ చేసుకునే డెడ్ లైన్..చెయ్యకుంటే నో సబ్సిడీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి ముఖ్యమైన సమాచారం అందిస్తుంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జారీ చేసిన కీలక నిర్ణయం ప్రకారం, జూన్ 30, 2026 లోపు అన్ని గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ గడువును పట్టించుకోకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అక్రమ గ్యాస్ కనెక్షన్ల కు చెక్ పెట్టేలా కేంద్రం చర్య

ఈ-కేవైసీ ద్వారా గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం జరుగుతుంది. ఇది అనర్హులు గ్యాస్ సబ్సిడీని దుర్వినియోగం చేయకుండా అరికట్టడంతో పాటు, నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీ సకాలంలో అందడం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యగా చెప్తున్నారు. గత ఏడాది నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నా, ఇంకా చాలా మంది వినియోగదారులు దీన్ని పూర్తి చేయలేదు. అక్రమ గ్యాస్ కనెక్షన్లు మరియు డూప్లికేట్ ఖాతాలను నిరోధించడానికి కేంద్రం ఈ చర్య చేపట్టింది.

Big alert on LPG ekyc Deadline for e-KYC for gas consumers no subsidy will given if not completed ekyc

ఈకేవైసీ చేయనివారికి మైఎల్‌పీజీ యాప్

సబ్సిడీ సరైన వ్యక్తులకు మాత్రమే చేరేలా చేయడానికి, డిజిటల్ పారదర్శకతను పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈకేవైసీ చేయని వారు చాలా మంది ఈకేవైసి చేసుకుంటున్నారు. ఇప్పటికే బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసిన వారు మైఎల్‌పీజీ యాప్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. కొత్తగా చేయాల్సిన వారు ఇప్పుడే తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://mylpg.in లేదా https://pmuy.gov.in కి వెళ్లి చెయ్యాలి.

ఇంత సింపుల్ గా ఈకేవైసీ ప్రక్రియ

Google Play Store నుంచి అధికారిక మైఎల్‌పీజీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. మీ గ్యాస్ కంపెనీ (ఇండేన్, హెచ్‌పీ, బీపీ) ఎంచుకుని 'New User' గా రిజిస్టర్ చేసుకోండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయండి. ప్రొఫైల్ సెక్షన్‌లో 'e-KYC' లేదా 'Aadhaar Authentication' ఆప్షన్‌ను ఎంచుకోండి. ఫేస్ రికగ్నిషన్ లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ప్రక్రియ ముగుస్తుంది.

పవన్ కళ్యాణ్ శాఖలో ఉద్యోగులకు అదిరిపోయే వార్త... వాళ్లకు పండుగే!
పవన్ కళ్యాణ్ శాఖలో ఉద్యోగులకు అదిరిపోయే వార్త... వాళ్లకు పండుగే!

జూన్ 30 ముందే ఈకేవైసీ చేయకుంటే నో సబ్సిడీ

చాలా సింపుల్ గా చేసే ఈ ప్రక్రియ కోసం సమీప గ్యాస్ ఏజెంట్ వద్దకు వెళ్లి ఈ-కేవైసీ అని చెప్పండి. అక్కడ ఉచితంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని కనెక్షన్లు భవిష్యత్తులో సబ్సిడీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జూన్ 30 ముందే పూర్తి చేయండి. ఈ సమాచారం ఆంధ్రప్రదేశ్ గ్యాస్ వినియోగదారులందరికీ ఖచ్చితంగా తెలియాల్సిన సమాచారం..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+