ఉదయాన్నే నిద్రలేస్తే ఏం జరుగుతుందో తెలుసా..!!

ఉదయం నిద్ర లేవటం ఆరోగ్యకరమైన అలవాటు. ఉదయాన్నే నిద్ర లేవటం ద్వారా ఆ రోజు మొత్తం మీ నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాత్రి త్వరగా నిద్రపోయి, ఉదయాన్నే త్వరగా లేవడం మంచి అలవాటు అని పెద్దలు చెబుతుం టారు. ఇలా చేయడం వల్ల రోజువారీ పనులను ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు. ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర లేచేవారు జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తార‌ని మ‌న‌స్త‌త్వ శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల సీఈవోలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

ఉదయాన్నే నిద్ర లేవటం ద్వారా ఎన్నో రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఆలస్యంగా నిద్రపోయి, ఆలస్యంగా లేస్తున్నారు. ఈ అలవాటు బద్ధకాన్ని పెంచడమే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. జీవనశైలిలో చిన్న మార్పు చేసి, త్వరగా నిద్రపోయి త్వరగా లేవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం ఆలస్యంగా లేస్తే పనులన్నీ తొందరపాటుగా చేయాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. కానీ త్వరగా నిద్రలేస్తే పనులను ప్రశాంతంగా, సమయానికి పూర్తి చేసుకోవచ్చు. ఇది మనసును తాజాగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల వ్యాయామానికి సమయం దొరుకు తుంది. ఉదయం చేసే వ్యాయామం శరీరానికి శక్తిని అందించడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ఉపయోగ పడుతుంది. ఉదయం సమయంలో గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఆ సమయంలో వాకింగ్ లేదా వ్యాయామం చేస్తూ లోతుగా శ్వాస తీసుకోవడం ఊపిరితిత్తులకు మంచిది. దీంతో శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
waking-up-early-can-help-regulate-bodys-natural-sleep-wake-cycle-leading-to-better-sleep-quality

నిపుణుల సూచనలు

ఉదయాన్నే లేచి ధ్యానం, నడక లేదా ప్రశాంతంగా గడపడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. రోజును ఉత్సాహంగా ప్రారంభించ డానికి ఈ అలవాటు ఎంతో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే త్వరగా లేచే వారు సాధారణంగా రాత్రి కూడా త్వరగా నిద్రపోతారు. దీంతో వారి నిద్ర సమయానికి పూర్తవడంతో పాటు నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర‌లేచే వారిలో ఒత్తిడి, ఆందోళ‌న స్థాయిలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. వీరు ఇత‌రుల‌తో పోలిస్తే చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటార‌ని చెబుతున్నారు. కొద్ది రోజుల పాటు మీరు ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర‌లేవడాన్ని అల‌వాటు చేసుకుంటే త‌రువాత మీకు ఆ దిన‌చ‌ర్య అల‌వాటై పోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+