సిపిఐకి సిద్ధాంతం లేదు: మధు
కర్నూలు: సిపిఐకి సిద్ధాంతాలు లేవని, అందుకే ప్రత్యేక తెలంగాణకు మద్దతు ప్రకటిస్తోందని సిపియం పార్లమెంటు సభ్యుడు పి. మధు విమర్శించారు. ఐక్య కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర కోసం కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల ఒరిగేదేమీ ఉండదని, సిపిఐ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షించుకోవడం అవసరమని ఆయన అన్నారు. హైదరాబాదులో మజ్లీస్ అరాచాకాలు సృష్టిస్తోందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications