మంత్రి కాసుపై మజ్లీస్ గరం
హైదరాబాద్: తమకు చెప్పకుండా రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి హైదరాబాద్ పాతబస్తీలో ఆకస్మిక తనిఖీలకు రావడంపై మజ్లీస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు చెప్పకుండా పాతబస్తీ పర్యటనకు మంత్రి రావడమేమిటని వారు ప్రశ్నించారు. దీంతో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మజ్లీస్ కార్యాలయానికి వెళ్లి వారిని బుజ్జగించారు. మంత్రి మర్యాదపూర్వకంగానే తమ కార్యాలయానికి వచ్చారని మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ చెప్పారు.
ఆకస్మిక తనిఖీలకు వచ్చాను కాబట్టి తాను ఎవరికీ చెప్పలేదని, మీడియాకు కూడా చెప్పలేదని కాసు వెంకటకృష్ణా రెడ్డి వివరణ ఇచ్చారు. తమిళనాడు తరహాలో పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ విక్రయిస్తామని, చౌక ధరల దుకాణాల్లో మందులు అమ్ముతామని ఆయన చెప్పారు. అర్హులైనవారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications