కృష్టతో ప్రేమ నిజమే: సరోజాదేవి
బెంగుళూర్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణకు, తనకు మధ్య ప్రేమాయణం నడిచినట్లు మాజీ మంత్రి విశ్వనాథ్ తన ఆత్మకథలో రాయడం పట్ల అలనాటి ప్రముఖ నటి సరోజాదేవి అసహనం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ హళ్లి హక్కి హాడు (పల్లె పక్షుల పాట) రాసిన తన ఆత్మకథలో సరోజాదేవి, ఎస్.ఎం. కృష్ణల మధ్య నడిచిన ప్రేమాయణం గురించి ప్రస్తావించారు. విశ్వనాథ్ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని ఆమె అన్నారు. అత్మకథలో విశ్వనాధ్ తన గురించి రాసుకోవాలని, ఇతరుల గురించి రాసే అర్హత విశ్వనాథ్ కు లేదని ఆమె అన్నారు.
ఎస్.ఎం. కృష్ణ వయస్సులో ఉన్నప్పుడు అందంగా ఉండేవారని, కృష్ణ తనపై మనసు పారేసుకున్న మాట నిజమేనని, తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్న మాట కూడా నిజమేనని ఆమె అన్నారు. కృష్ణ అప్పుడూ ఇప్పుడూ మంచి మిత్రుడని, పాత విషయాలను ప్రస్తావనకు తేవడం సరి కాదని ఆమె అన్నారు. వ్యక్తిగత విషయాలకు అనవసరమైన ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె అన్నారు. సరోజాదేవి తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు.












Click it and Unblock the Notifications