వైయస్ అడ్డు కారు: సర్వే
న్యూఢిల్లీ: రాష్ట్రం మూడు ముక్కలైనా తమ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డేనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణకు రాజశేఖర రెడ్డి వ్యతిరేకం కారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలకు తమకు పెట్టిన గడువు 2009 అని ఆయన అన్నారు. ఏనాటికైనా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తమతో కలవాల్సిందేనని ఆయన అన్నారు. కాంగ్రెసును భూస్థాపితం చేస్తే చంద్రశేఖర రావు ఎక్కుడుంటారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణను కాంగ్రెస్ మోసం చేసిందనే బిజెపి విమర్శపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారం కోసం తెలంగాణను వంచించింది బిజెపియేనని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యతిరేకం కాబట్టి తెలంగాణ అంశాన్ని బిజెపి పక్కన పెట్టి మోసం చేసిందని ఆయన విమర్శించారు. బిజెపి చంద్రబాబు ట్యూన్స్ కు డ్యాన్స్ చేసిందని ఆయన అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని విమర్శించే నైతిక హక్కు బిజెపికి లేదని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాలను ఇచ్చిన బిజెపి తెలంగాణను మాత్రం పక్కన పెట్టిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications