కమిషన్ ముందు కోనేరు కూతురు
విజయవాడ: విద్యార్థిని అయేషా హత్య కేసులో మానవ హక్కుల కమీషన్ ముందు మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు కూతురు తాంతియా కుమారి, మనవడు సతీష్ ఆదివారంనాడు హాజరయ్యారు. అయేషా హత్య కేసుతో కొనేరు రంగారావు బంధువులకు సంబంధం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను కోనేరు రంగారావు ఖండించారు. తమపై అనుమానం ఉంటే ఏ విధమైన విచారణనైనా చేయించుకోవచ్చునని తాంతియా కుమారి కమీషన్ ముందు ఉన్నారు.
కమీషన్ వేదిక వద్ద మహిళా సంఘాల నేతలకు, తాంతియా కుమారికి మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో వివాదం సద్దమణిగింది. తాంతియా కుమారి తీరును ఐద్వా నాయకులు తప్పు పట్టారు. మహిళా సమస్యలపై తాము పోరాటాలు చేస్తున్నామని వారన్నారు.












Click it and Unblock the Notifications
