నీరుగార్చేందుకే సిబిఐకి అయేషా కేసు: బాబు

Chandrababu Naidu
న్యూఢిల్లీ: విజయవాడలో దారుణ హత్యకు గురైన విద్యార్థిని అయేషా కేసును సిబిఐకి అప్పగించడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యతిరేకించారు. కేసును నీరు గార్చడానికే అయేషా హత్య కేసును సిబిఐకి అప్పగించారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. సిబిఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిపోయిందని, అందువల్ల సిబిఐకి అయేషా కేసును అప్పగించడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.

ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. గిట్టుబాటు ధరలు లేక, ఇన్ పుట్స్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. రుణాలపై వడ్డీ మాఫీ చేయడమే ప్రసుతం పరిష్కారమార్గమని ఆయన అన్నారు. ఖాయిలా పరిశ్రమలకు రాయితీలు ప్రకటిస్తున్న ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+