మిస్ ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ సిఆర్ పియఫ్ బెటాలియన్ క్యాంపులో మిస్ ఫైర్ జరిగి బుధవారం హెడ్ కానిస్టేబుల్ విపిఎం నాయుడు మరణించారు. నాయుడు ఛాతీలోకి తుపాకి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
తుపాకి మిస్ ఫైర్ అయి నాయుడు మరణించాడా, ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు బయలుదేరుతున్నాయి. దీనిపై మాట్లాడడానికి అధికారులు నిరాకరిస్తున్నారు.
నాయుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బయటపడింది. ఆయన రాసిన సూసైడ్ నోట్ లో ఈ విషయం బయటపడింది. అధికారుల వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను లేఖ రాసి పెట్టాడు. నాయుడిది చిత్తూరు జిల్లా పీలేరు. జిల్లా ఆస్పత్రికి తరలించే లోగానే నాయుడు మృతి చెందాడు.












Click it and Unblock the Notifications