మహర్షి యోగి కన్నుమూత
హేగ్: భారతీయ ఆధ్యాత్మిక సంపదను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన మహర్షి మహేష్ యోగి కన్ను మూశారు. బియాటిల్స్ కు గురువైన మహర్షి యోగి డచ్ లోని వ్లాడ్రోప్ నివాసంలో మంగళవారం కన్ను మూసినట్లు అధికార ప్రతినిధి చెప్పారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. మహర్షి యోగి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రశాంతంగా కన్నుమూసినట్లు యోగా ఉద్యమం బాబ్ రోథ్ చెప్పారు. వయస్సు మీద పడడం వల్ల ఆయన మరణించినట్లు తెలిపారు.
హిందూ మత సంప్రదాయానికి చెందిన బౌద్ధిక నియంత్రణను మహర్షి యోగి బోధించారు. దీనికి వైద్య సంబంధమైన ప్రాధాన్యం చేకూరడంతో విశేష ఆదరణ పొందింది. మహారాష్ట్రలో 1955లో ఆయన తన బోధనలను ప్రారంభించారు. ఈ బోధనలు 1959లో అమెరికా సమాజానికి పరిచయమయ్యాయి. బియాటిల్ 1968లో మహర్షి యోగి ఆశ్రమాన్ని సందర్శించడంతో ఆయన బోధనలకు విశేష ప్రచారం లభించింది. ఆయన హిమాలయ పర్వత శ్రేణుల్లో పర్యటించి కొన్ని వైద్య సంబంధమైన మందులను కనిపెట్టారు.












Click it and Unblock the Notifications