కాకా ఇంట్లో తెలంగాణ నేతల భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుధవారం పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి నివాసంలో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించేందుకు నాయకత్వం వహించాల్సిందిగా వారు వెంకటస్వామిని కోరారు. సమావేశంలో ఎం. సత్యనారాయణరావు, వి. హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కె.ఆర్. అమోస్ వంటి నేతలు పాల్గొన్నారు.
సోనియా బిజీగా ఉండడంతో వారు ఆమెను బుధవారంనాడు కలువలేకపోయారు. రేపు గానీ, ఎల్లుండి గానీ వారు సోనియాను కలిసే అవకాశం ఉంది. వీరు హైదరాబాద్ నుంచి వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఇప్పటికే సోనియాకు తెలియజేశారు. వీరంతా బుధవారంనాడు అధిష్ఠాన వర్గానికి చెందిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శులతో కలుస్తున్నారు. విడివిడిగా కూడా తమ పరిచయాల ఆధారంగా, సాన్నిహిత్యం ఆధారంగా కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నారు. తెలంగాణ అంశంపై కోర్ కమిటీ ఇప్పటికే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో చర్చించారు. అయితే కోర్ కమిటీలో తెలంగాణపై ఎటూ తేల్చలేదు. సోనియా మనసులో కూడా ఏముందో తెలియడం లేదు.












Click it and Unblock the Notifications