విలాసరావుతో వైయస్ ఫోన్ సంభాషణ
హైదరాబాద్: ముంబయిలోని తెలుగువారికి భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ ను కోరారు. విలాసరావుతో రాజశేఖర రెడ్డి ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం ఫోనులో మాట్లాడారు. ముంబయిలో ప్రాంతీయ విద్వేషాలు చోటు చేసుకున్న నేపధ్యంలో తెలుగువారి భద్రతపై ఆయన విలాసరావుతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కోర్ కమిటీ సభ్యులు తనకు కొన్ని సలహాలు ఇచ్చారని రాజశేఖర రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఢిల్లీ నుంచి ఆయన బుధవారం మధ్యాహ్నం హైదరాబాదుకు తిరిగి వచ్చారు. పొగమంచు కమ్ముకున్న కారణంగా ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో రెండున్నర గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి హైదరాబాదుకు రావాల్సిన ఆయన కోర్ కమిటీ సమావేశం వల్ల ఢిల్లీలో ఆగిపోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications