అయేషా హత్య కేసులో ఒత్తిళ్లు లేవు: ఆనంద్
విజయవాడ: ఆధారాలు లేకపోవడం వల్లనే విద్యార్థిన అయేషా హత్య కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందని విజయవాడ పోలీసు కమీషనర్ సి.వి. ఆనంద్ చెప్పారు. ఈ కేసులో తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కేవలం ఆరోపణల ఆధారంగా ఎవరినీ అరెస్టు చేయలేమని ఆయన చెప్పారు. మంత్రి కోనేరు రంగారావు మనవడిని కూడా విచారించామని ఆయన చెప్పారు.
అయేషా హత్య కేసులో కోనేరు రంగారావు కుటుంబానికి సంబంధాలున్నాయని, అందువల్లనే పోలీసులు కేసు దర్యాప్తును సాగించడం లేదని, నిందితులను అరెస్టు చేయడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమీషన్ కు అయేషా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వార్డెన్, ఆమె భర్తపై అయేషా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
