విద్యార్థి ఉదయ్ అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఉదయ్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని శవం సికింద్రాబాదులోని బోరబండ ప్రాంతంలో రైలు పట్టాలపై కనిపించింది. దీంతో అతని తల్లిదండ్రులు బోరుమన్నారు. ఉపాధ్యాయుల వేధింపుల వల్లనే తమ కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు అంటున్నారు.
ఉదయ్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి గ్రామం. మిత్రులతో కలిసి ఉదయ్ హాస్టల్ కు వచ్చాడు. రైలు ఢీకొనడంతో ఉదయ్ మరణించాడని ప్రిన్సిపాల్ అంటున్నారు. భవనంపై నుంచి కింద పడిపోయాడని ఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే వారు వచ్చే సరికి మార్చురీకి తరలించారు. అ తర్వాత మాట మార్చి రైలు పట్టాల కింద పడి మరణించాడని చెప్పారు.












Click it and Unblock the Notifications
