ట్రాఫిక్ లో చిక్కుకున్న సురవరం
హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో సోమవారం ఉదయం కురిసిన వర్షానికి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ జామ్ లో సిపిఐ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి చిక్కుకున్నారు. లక్డికా పూల్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సోమాజిగుడాకు రావడానికి ఆయనకు రెండు గంటల సమయం పట్టింది. అలాగే శాసనసభ చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పలువురు శాసనసభ్యులు వాహనాలను వదిలేసి కాలినడకన శాసనసభకు చేరుకున్నారు.
హైదరాబాదులోని లిబర్టీ, సోమాజిగుడా, ఖైరతాబాద్, బషీర్ బాగ్, లక్డికా పూల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే సికింద్రాబాదులోని తార్నాకా, చిలకలగుడా, మెట్టుగుడా తదితర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాదులో కొద్దిపాటి వర్షం కురిసినా ట్రాఫిక్ జామ్ కావడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం పరిపాటి అయింది.












Click it and Unblock the Notifications
