నిమ్స్ ఆస్పత్రిలో డాక్టరుపై దాడి: కేసు నమోదు
హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలోని ఓ డాక్టర్‌పై పేషెంట్ తాలూకు వ్యక్తులు దాడికి పాల్పడ్డ కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ప్రభుత్వం డాక్టర్లపై దాడికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవో ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ముషీరాబాద్‌లోని బీర్బన్‌బాగ్‌లో నివశిస్తున్న అంజన్‌బాషాకు ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలయ్యాయి. వైద్య సేవల నిమ్మితం అతనిని నిమ్స్‌కు తరలించారు. ఇక్కడ వైద్య అందిస్తున్న సమయంలో అంజన్‌బాషా మృతి చెందాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే అంజన్‌బాషా చనిపోయాడని అతని బంధువులు చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరసింహారావుతో వాగ్వివాదానికి దిగారు.
ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి డాక్టర్‌ను తలపై బలంగా కొట్టాడు. దీంతో డాక్టర్ ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా నిమ్స్ డైరెక్టర్‌కు, పోలీసులకు పిర్యాధు చేశారు. ఈ పిర్యాధు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని వైద్యుల బృందం తెలిపింది.












Click it and Unblock the Notifications
