చిరంజీవి చెప్తే వచ్చా: అల్లు అర్జున్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చెప్తే తాను వచ్చానని తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ చిరంజీవి అభిమానులను ఉద్దేశించి అన్నారు. చిరంజీవి అభిమానులు ఆదివారంనాడు హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ లో భారీ రక్త దానశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. మెమెంటోలు అందజేశారు.
సినిమా షూటింగ్ మధ్యలో తాను గంట ఖాళీ ఉన్నా బయటకు రాబోనని, ఈ రోజు వచ్చానని ఆయన చెప్పారు. రక్తదాన శిబిరానికి హాజురు కావాలని తనను చిరంజీవి అడిగారని, దాంతో ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు షూటింగ్ లేని రోజుల్లో ఉండేట్లు చూసుకుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications