నాకు ఢిల్లీలో అవమానం: కాకా
హైదరాబాద్: తనకు ఢిల్లీలో జరిగిన అవమానం 120 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి అన్నారు. సోనియా గాంధీ తనకు అపాయింట్ మెంటు ఇవ్వకుండా అవమానించారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇంత అవమానం తనకు ఎన్నడూ జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డంకి అని ఆయన అన్నారు. తెలంగాణను ముఖ్యమంత్రి కాశ్మీర్ సమస్యతో పోల్చడం సరి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం తప్ప అన్ని పార్టీలు తెలంగాణ కావాలని కోరుతున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణపై తాను రాజీనామా చేయబోనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ సీనియర్లు వచ్చే నెల 10వ తేదీ నల్లగొండ జిల్లాలో పెట్టే సభకు తాను హాజరవుతానని ఆయన చెప్పారు. తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనని ఆయన అన్నారు. జూనియర్ కాంగ్రెస్ నాయకుల సమావేశంపై మాట్లాడటం తన స్థాయికి తగదని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యుడినని, దేశంలోనే తాను సీనియర్ కాంగ్రెస్ నాయకుడినని, తనకు సోనియా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం కాంగ్రెసుకే అవమానకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications