తెలంగాణపై సోనియా ప్రకటన వచ్చే నెలలో?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వచ్చే నెల 14న రాష్ట్రంలో జరిపే ఒక రోజు పర్యటనలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సోనియా గాంధీతో సమావేశమై, రాష్ట్రంలో ఆమె పర్యటన, ప్రత్యేక తెలంగాణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.
సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే రాజశేఖరరెడ్డి అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్ళి గంటన్నర సేపు సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రత్యేక తెలంగాణ, చిరంజీవి రాజకీయ పార్టీ గురించి వైఎస్ ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. మార్చి 14న హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో సోనియాగాంధీ తెలంగాణ మీద విస్పష్ట ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications