భయపెట్టడానికే వైయస్ ప్రకటన: వినోద్
హైదరాబాద్: తెలంగాణపై మభ్యపెట్టడానికే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నిఘా వర్గాల నివేదికల గురించి మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ సమస్య పెరుగుతుందని ముఖ్యమంత్రి అనడం ప్రజలను భయబ్రాంతులను చేయడానికేనని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
హోంమంత్రి కె. జానారెడ్డి అందకుండా నివేదికలు తనకే అందాయని ముఖ్యమంత్రి చెప్పడాన్ని బట్టి తెలంగాణ విషయంలో ఏం జరుగతోందో అర్థం చేసుకోవచ్చనని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు జరిగిన అన్యాయం వల్ల పేదరికం పెరిగి యువత నక్సలిజం వైపు మళ్లుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications