క్యూబా అధ్యక్షుడిగా క్యాస్ట్రో రాజీనామా
క్యూబా: క్యూబా అధ్యక్ష పదవి నుంచి ఫిడెల్ క్యాస్ట్రో తప్పుకున్నారు. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కమాండర్ ఇన్ చీఫ్ పదవికి కూడా ఆయన రాజీమానా చేశారు. అధికార కమ్యూనిస్టు పార్టీ పత్రికలో ప్రచురించిన లేఖలో ఆయన ఈ విషయం చెప్పారు. గువేరాతో కలిసి సాయుధ పోరాటం చేసి అధికారం చేజిక్కించుకున్న తర్వాత 1959 నుంచి ఆయన క్యూబా అధ్యక్ష పదవిని క్యాస్ట్రో చేపట్టారు. అమెరికాకు వ్యతిరేకంగా నిలిచిన ప్రపంచ నేతల్లో ఆయన ప్రథముడిగా గణనలోకి వస్తారు.
క్యాస్ట్రో 2006 జులైలో తన సోదరుడు, పోరాట సహచరుడు రాల్ కు తాత్కాలికంగా అధ్యక్ష పదవిని అప్పగించారు. ఆ తర్వాత ప్రేవులకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. క్యాస్ట్రో వయస్సు 81 ఏళ్లు. అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా పాలనకు ఆయన దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications