పార్టీ బలమే వైయస్ బలం: హర్షకుమార్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బలమే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బలమని, పార్టీ బలంగా బలంగా లేకపోతే ముఖ్యమంత్రి ఒక్కరే బలంగా ఉండడం వల్ల లాభం లేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. సమైక్యాంధ్రలో ఆంధ్ర వెనకబడిపోతోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విశాఖపట్నం తప్ప ఆంధ్రలోని మిగతా ప్రాంతాలన్ని వెనకబడి పోతున్నాయని ఆయన అన్నారు.
2009లో ఎన్నికలకు వెళ్లే లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ప్రకటిస్తుందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియను అధిష్ఠానవర్గం కొనసాగిస్తోందని ఆయన అన్నారు. ఆంధ్ర నుంచి ఆదాయం ఎక్కువగా వస్తోందని, దాన్నంతా తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. పార్కులు విశాఖపట్నంలో తప్ప ఆంధ్రలో మరెక్కడా అభివృద్ధి కావడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications