తెలంగాణ విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి సంఘాలు మంగళవారం శాసనసభ ప్రాంగణంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాయి. అయితే పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీని తెలంగాణ విద్యార్థులు ముట్టడించడంతో అలజడి చెలరేగింది.
తెలంగాణ విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. 20 మంది విద్యార్థులను పోలీసులను అరెస్టు చేశారు. విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం అందర్నీ అశ్చర్యపరిచింది.












Click it and Unblock the Notifications