కెసిఆర్ పచ్చి మోసగాడు: జీవన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పచ్చి మోసగాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి టి. జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రశేఖర రావు తెరాస పాలిటి భస్మాసురుడని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజీనామాలు చేయడం తెరాస బాధ్యతా రాహిత్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పోయిన ప్రతిష్టను తిరిగి పొందడానికే తెరాస ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ సెంటిమెంటు అనేది కెసిఆర్ కు మాత్రమే పరిమితమైంది కాదని, తెలంగాణపై వివిధ అభిప్రాయాలున్నాయని ఆయన అన్నారు. సెంటిమెంటు మాత్రమే కాకుండా వివిధ విషయాల గురించి కూడా ఆలోచించాల్సి ఉందని, వివిధ అంశాలపై ఆలోచన చేసిన తర్వాతనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. వివిధ ప్రాంతాలను విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. తమ కాంగ్రెస్ పార్టీ ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ఒక్క మాటకు కట్టుబడి ఉండడం లేదని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ అంటూ సంతకాలు సేకరించిన పురుషోత్తమ రెడ్డి ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏదైనా చెప్పదలుచుకుంటే పార్టీ అధిష్ఠానవర్గంతో చెప్పాలని ఆయన పురుషోత్తమ రెడ్డికి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+