మాకు హక్కు ఉంది: నాయని
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల చేత ప్రజలే రాజీనామాలు చేయిస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ వారి రాజీనామాలు అడిగే హక్కు తమకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ నినాదంతో గెలిచిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి తిరిగి విడిగా గెలవాలని ఆయన సవాల్ చేశారు.
తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెబుతున్న కాంగ్రెసువారికి ప్రజలు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తేవాలని, లేదంటే రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు. రాజీనామాలు తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్గత వ్యవహారమని, తాము దానిపై మాట్లాడబోమని కాంగ్రెసు శాసనసభ్యుడు శ్రీధరబాబు అన్నారు.












Click it and Unblock the Notifications