సోనియా హైదరాబాద్ సభ రద్దు

సోమవారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లోకసభ సభ్యులు రాజీనామా చేయడం, రేపు తెరాస శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తుండడం, తెలంగాణపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా సోనియా పర్టన సందర్భంగా బిజెపి బంద్ కు పిలుపు ఇవ్వడం ఈ సభ రద్దుకు కారణమని భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా హైదరాబాదులో సోనియా సభ జరగడం సరి కాదని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం భావించినట్లు చెబుతున్నారు.
ఈ నెల 14వ తేదీన సోనియా మొదట తూర్పు గోదావరి జిల్లాలోని పుష్కర ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారు. అనంతరం జక్కంపేటలో బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత దేవాదుల, పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సోనియా బహిరంగ సభ జరగాల్సి ఉండింది. ఈ సభ మాత్రం రద్దయింది.












Click it and Unblock the Notifications