అసెంబ్లీ: టిడిపి సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: సభా కార్యక్రమాలను స్తంభింపజేసిన తెలుగుదేశం శాసనసభ్యులను 23 మందిని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సోమవారంనాడు ఒక రోజు పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. సభ సమావేశం కాగానే భూముల వేలం పాటలపై తెలుగుదేశం సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అయితే తెలుగుదేశం సభ్యులు భూముల వేలంపై తక్షణ చర్చకు అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. వారి డిమాండ్ కు ప్రతిపక్షాల నుంచి మద్దతు లభించింది.
తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడకుండా ఆందోళనకు దిగడంతో దేవేందర్ గౌడ్ సహా 23 మందిని స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. తెలుగుదేశం సభ్యులు చెప్పినట్లు సభను నడపడం సాధ్యం కాదని, అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊర్కోలేమని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య అన్నారు. సభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తెలుగుదేశం సభ్యులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో భూముల వేలంపై కార్యక్రమం నిర్వహించారు.












Click it and Unblock the Notifications