తెరాస రాజీనామాలు నష్టమే: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాలు కాంగ్రెసుకు నష్టమేనని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇవ్వాల్సిందేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రజాస్పందన ఉందని, అందువల్ల తెలంగాణపై జాప్యం చేయడానికి వీలు లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని పరుష పదజాలంతో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ దూషించడం మంచిది కాదని, కాంగ్రెసు మోసం చేసిందనీ సోనియా మోసం చేశారనీ విమర్శించవచ్చునని ఆయన అన్నారు.
తెలంగాణలోని ఏదైనా నియోజకవర్గం నుంచి తెలంగాణ సెంటిమెంటు లేదని అనేవాళ్ల నుంచి ఒకరు, ఉన్నదని అంటున్నవాళ్లు ఒకర పోటీ చేయాలని, అప్పుడు సెంటిమెంటు ఉందో లేదో తేలిపోతుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. అన్ని చూస్తూ కూడా తెలంగాణ సెంటిమెంటు లేదని అనడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications