తెలుగులో " చందమామ" ఆన్ లైన ఎడిషన్

Subscribe to Oneindia Telugu
Chandamama Edition
చెన్నై: అనేక తెలుగు తరాలను బాల్యంలో ప్రభావితం చేసిన "చందమామ" బాలల పత్రిక గురించి అందరికీ తెలుసు. నాగిరెడ్డి- చక్రపాణి ఈ పత్రికను మొదట తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభంచి, విపరీత పాఠకాదరణ ఉండడంతో మరో 12 భాషలకు విస్తరించారు.

చిన్న పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ యాగం అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు పిల్లలు ఇంటర్నెట్ ను ఎక్కువగా ఇష్ట పడుతుండడంతో చందమామ తెలుగు వెర్షన్ ను నెట్ లో పెట్టారు. 1947 లో చందమామ తెలుగు, తమిళ ఎడిషన్లు ప్రారంభమయ్యాయని, ఈ పత్రిక ఆన్ లైన వెర్షన్ ను తెలుగులో ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నామని చందమామ ఎడిటర్ విశ్వనాథ రెడ్డి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Please Wait while comments are loading...