మహేష్, చార్మీ ఇళ్లపై ఐటి దాడులు

మహేష్ బాబు సినిమాకు 8 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడనే వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ ఐటి అధికారుల దాడులు జరిగాయి. మహేష్ బాబు కుటుంబం కాంగ్రెసుకు సన్నిహితం. అయినా మహేష్ బాబు ఇల్లు సోదాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. సికింద్రాబాదులోని రాష్ట్రపతి రోడ్డులో గల ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. ఈ సోదాలపై సినీ ప్రముఖులు, ఐటి అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ సోదాల్లో అధికారులు పత్రాలను, సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఆర్థిక సంవత్సరాంతంలో ఇటువంటి దాడులు జరగడం సాధారణం. నిరుడు పూరీ జగన్నాధ్, తదితరుల ఇళ్లపై ఐటి దాడులు జరిగాయి.












Click it and Unblock the Notifications