నిజం తెలిసి సోనియా సభ రద్దు: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంటు లేదని చెప్పడానికి ఈ నెల 14వ తేదీన హైదరాబాదులో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ పెట్టారని, నిజం తెలుసుకుని సోనియా సభను రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 24 రోజులు శాసనసభా సమావేశాలు పెట్టుకుని పోతామని, ప్రజల్లోకి వెళ్లినప్పుడు తెలుస్తుందని, తెలంగాణపై ప్రజలు నిలదీస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు కొంప మునుగుతుందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. దేశం నుంచి విడిపోతామని అడగడం లేదు కదా వేరే రాష్ట్రం అడుగుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications