అమెరికాలో తెలుగు డాక్టర్ హత్య వివరాలు

కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన లక్ష్మి, అంజయ్యల కుమారుడు కాపారపు శ్రీనివాస్ హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ కోర్సు పూర్తి చేసుకుని ఉన్నత వైద్యవిద్య కోసం అమెరికా వెళ్ళారు.
శ్రీనివాస్ 2002 లో అమెరికా వెళ్ళి ఓహ్లామా యూనివర్స్టిటీలో ఎమ్మెస్ చేసి, పెన్సిల్వేనియాలోని ఒక యూనివర్సిటీలో ఎండీ చేస్తున్నాడు. వారానికోసారి ఇంట్లో వారితో మాట్లాడే శ్రీనివాస్ గత వారం ఒక మెడికల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు కాలిఫోర్నియ వెళ్తున్నట్టు చెప్పాడు. అయితే అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. శ్రీనివాస్ హత్యకు గురైనట్టు తమకు సమాచారం అందిందని ఆయన్ సోదరుడు రవీంద్ర చెప్పారు. హత్యకు కారణాలేమిటో అమెరికన్ పోలీసులు వెల్లడించవలసి ఉంది.












Click it and Unblock the Notifications