త్రిపురలో లెఫ్ట్ : మేఘాలయలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో త్రిపురలో వరుసగా నాలుగో సారి వామపక్షాల కూటమి విజయం దిశగా పయనిస్తుండగా, మేఘాలయ హంగ్ దిశగా పయనించింది. మేఘాలయలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించినప్పటికీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదు. మేఘాలయలో ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 60 స్థానాల్లో 59 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 25 సీట్లను గెలుచుకుంది. పి.ఎ. సంగ్మా నాయకత్వం వహిస్తున్న ఎన్సీపి 13 స్థానాల్లో గెలిచింది. ఇతరులు 21 స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి సెంగ్రాన్ ఎం. సంగ్మా మృతి చెందడంతో బాఘ్మారా సీటు ఎన్నిక మార్చి 22వ తేదీకి వాయిదా పడింది.
త్రిపురలోని 60 స్థానాల్లో సిపియం నేతృత్వంలోని వామపక్ష కూటమి 47 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూటమి 9 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇద్దరు ఇతరులు ముందంజలో ఉంది. ఫిబ్రవరి 23వ తేదీన త్రిపుర శాసనసభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తన ప్రత్యర్థిపై 2 వేల ఓట్ల ఆధిక్యలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications