పవన్, నందినిల మధ్య కుదరని రాజీ

నందిని కోర్టు హాజరు కావడానికి ముందు నాటకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టుకు హాజరు కావడానికి తనకు రక్షణ కల్పించాలని నందిని కోరారు. దీంతో ఆమెకు పది మంది పోలీసులను రక్షణగా ఇచ్చారు. రక్షణ మధ్య ఆమె కోర్టు వచ్చిన రెండు నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయమే విశాఖపట్నం వచ్చినప్పటికీ దాదాపు 3 గంటల పాటు బయటనే గడిపాడు. పవన్ కళ్యాణ్ పై నందిని వేసిన బహుభార్యాత్వం కేసును కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ పై నందిని శుక్రవారంనాడు హైకోర్టులో బహుభార్యాత్వం కేసుకు సంబంధించి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను హైకోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications