ఒరిస్సా తర్వాత ఆంధ్ర: రాహుల్

ఒరిస్సా పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తానని రాహుల్ గాంధీ ఆంధ్ర నాయకులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి, ప్రత్యేక తెలంగాణ నినాదం గురించి ఆంధ్రప్రదేశ్ నాయకులు రాహుల్ గాంధీకి వివరించారు. ఎస్పీజి హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు ఏర్పడడం వల్ల రాహుల్ ఒరిస్సా పర్యటనలో కాస్తా జాప్యం జరిగింది. రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ తన చివరి ప్రసంగం ఒరిస్సాలోని భువనేశ్వర్ లో చేశారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో హత్యకు గురికావడానికి ముందు ఆయన తండ్రి రాజీవ్ గాంధీ ఒరిస్సాలో పర్యటించారు. దీంతో రాహుల్ గాంధీ తన భారత పర్యటనను ఒరిస్సా నుంచి ప్రారంభించాలనుకోవడంలో ఆ భావోద్వేగం పనిచేస్తోంది. ఒరిస్సాలో నాలుగు రోజుల పాటు ఆయన 13 కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications