ఎట్టకేలకు చిక్కిన చిరుత పులి
కర్నూలు: కర్నూలు జిల్లా ఆత్మకూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయపెట్టిస్తున్న చిరుత పులిని అధిక ప్రయాస తర్వాత అటవీ శాఖ అధికారులు పట్టుకోగలిగారు.
ఇటీవల నాలుగు నెలలుగా ఆత్మకూరు ప్రాంతంలో కరివేన, నల్లకాల్వ, గుంత కందాల, భాను ముక్కుల గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఈ భారీ చిరుత పట్టుబడడంతో గ్రామష్దులు హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఈ చిరుత అటవీ శాఖ అధికారులు ఎన్నో బోనులు పెట్టినా ఆ వలలో పడకుండా జాగ్రత్త పడింది. ఈ రోజు బోనులో కుక్క పిల్లలను పెట్టి చిరుతను ఆకర్షించగలిగారు.












Click it and Unblock the Notifications