కర్ణాటకలో షాక్ కొట్టేలా పెరిగిన పాల ధరలు: లీటర్ కు ఏకంగా రూ. 8: టీ, కాఫీ రేట్లూ జంప్

కర్ణాటకలో నందిని బ్రాండ్ పాల ధరలు భారీగా పెరిగాయి. లీటర్ కు ఎనిమిది రపాయలు చొప్పన అదనపు భారం పడింది. పెరిగిన ధరలు నవంబర్ 1వ తేదీ నుంచి అంటే- ఆదివారం నుంచి అమలులోకి రానున్నాయి. పెరిగిన ధరలను అన్ని రకాల వేరియంట్లకూ వర్తింపజేసిందక్కడి ప్రభుత్వం. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. నందిని పాల రేట్లు పెరగడం 2022 నుంచి ఇది అయిదోసారి. చివరిసారిగా 2025 ఏప్రిల్ 1న లీటర్ పై నాలుగు రూపాయలు చొప్పున పెంచింది.

నందిని బ్రాండ్ పేరుతో.. టోన్డ్, డబుల్ టోన్డ్, స్టాండర్డైజ్డ్, సమృద్ధి ఫుల్ క్రీమ్, శుభం, శుభం గోల్డ్.. వంటి వేరియంట్లను విక్రయిస్తోంది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. నవంబర్ 1 నుంచి వాటి రేట్లన్నీ కూడా లీటర్ కు ఎనిమిది రూపాయలు చొప్పున పెరగనున్నాయి. ఇందులో ఏడు రూపాయలు రైతులకు వెళ్తుంది. ఒక రూపాయిని మిల్క్ యూనియన్లకు కేటాయించింది ప్రభుత్వం. నిజానికి.. లీటర్ పై రూ. 12 మేర పెంచాలంటూ రైతులు కోరినప్పటికీ దీన్ని రూ.8 కే పరిమితం చేసినట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.

Karnataka Govt Hiked Nandini Milk Prices by Rs 8 per Litre New rates to come into force from Nov 1

పెరిగిన రేట్ల ప్రకారం చూసుకుంటే.. 1 నుంచి టోన్డ్ మిల్క్ పాకెట్ రూ. 46 నుంచి రూ. 54 కు పెరుగుతుంది. హోమోజినైజ్డ్- రూ. 47 నుంచి రూ. 55 రూపాయలకు పెరుగుతుంది. శుభం మిల్క్ లీటర్ కు రూ. 52 నుంచి రూ. 60, సమృద్ధి ఫుల్ క్రీమ్- రూ. 55 నుంచి రూ. 64కు పెరుగుతుంది. స్పెషల్ మిల్క్ లీటర్ కు 52 నుంచి 60 రూపాయలకు చేరుతుంది. ప్రస్తుతం 43 రూపాయలు ఉన్న నందిని డబుల్ టోన్డ్ పాలు 51 రూపాయలకు చేరుతుంది.

తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం
తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం

పాల సేకరణ రేట్లను పెంచాల్సి రావడం వల్ల అదనంగా పడిన భారాన్ని వినియోగదారులపై నామమాత్రంగా మోపినట్లు ప్రభుత్వం వివరించింది. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిన పాల ఉత్పత్తి ధరను దృష్టిలో పెట్టుకుని, పాడి రైతుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కృష్ణ బైరెగౌడ తెలిపారు. పెరిగిన మొత్తంలో వచ్చే ఎనిమిది రూపాయలను కూడా పాడి రైతులు, మిల్క్ యూనియన్ల నిర్వహణకు బదలాయించినట్లు వివరించారు.

బెంగళూరు ఎమ్మెల్సీ లో కాంగ్రెస్ భారీ ఓటమి: మిగిలిన చోట్లా బీజేపీ-జేడీఎస్ క్లీన్ స్వీప్
బెంగళూరు ఎమ్మెల్సీ లో కాంగ్రెస్ భారీ ఓటమి: మిగిలిన చోట్లా బీజేపీ-జేడీఎస్ క్లీన్ స్వీప్

పాల రేట్లను పెంచిన వెంటనే కర్ణాటక హోటల్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనికి అనుగుణంగా టీ, కాఫీ, ఇతర పాల ఆధారిత ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. హోటళ్లు, రెస్టారెంట్లల్లో విక్రయించే టీపై రూ. 3, కాఫీపై రూ. 5 మేర పెంచుతున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావు, కర్ణాటక హోటల్స్ అసోసియేషన్ చీఫ్ జీకే షెట్టి, కర్ణాటక రాజ్య కార్మిక పరిషత్ ప్రెసిడెంట్ రవి షెట్టి బైండూర్ తెలిపారు.

బెంగళూరులో ఈ రద్దీ రూట్ లో ఎలివేటెడ్ కారిడార్.. !!
బెంగళూరులో ఈ రద్దీ రూట్ లో ఎలివేటెడ్ కారిడార్.. !!

ఇంత భారీ మొత్తంలో ఒకేసారి పాల రేట్లను పెంచడం సరికాదని అన్నారు. దీనికి అనుగుణంగా పాల ఆధారిత ఉత్పత్తులు క్యారట్ హల్వా, పాయసం, బాదమ్ మిల్క్ వంటి పదార్థాల రేట్లను కూడా పెంచుతున్నామని తెలిపారు. నందిని చరిత్రలో మొట్టమొదటిసారిగా లీటర్ పై ఒకేసారి ఎనిమిది రూపాయల మేర భారాన్ని మోపడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లపై అదనపు భారం పడుతుందని, దీన్ని నివారించడానికి టీ, కాఫీ రేట్లను పెంచక తప్పట్లేదని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+