నెతన్యాహూ ప్రభంజనం. 53 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా..

ఇజ్రాయెల్ రాజకీయం అంటేనే బెంజమిన్‌ నెతన్యాహూ.. ఎంతటి సంక్షోభం ఎదురైనా, ఎన్ని రాజకీయ తుఫాన్లు ముంచెత్తినా అధికార పీఠం వైపు అడుగులు వేయడంలో ఆయన శైలే వేరు! హమాస్ దాడుల తర్వాత దేశంలో జరిగిన అత్యంత రసవత్తర సార్వత్రిక ఎన్నికల్లో నెతన్యాహూ మరోసారి తన ప్రజాదరణను చాటుకున్నారు. తుది ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయన నేతృత్వంలోని లికుడ్ కూటమి అత్యధికంగా 53 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. మెజారిటీ మార్కుకు ఇంకో 8 సీట్లు మాత్రమే దూరంలో ఉన్న నెతన్యాహూ.. వ్యూహాత్మక చదరంగంలో మరోసారి తన మార్క్ చాటేందుకు సిద్ధమవుతున్నారు.

మేజిక్ మార్క్‌కు అడుగు దూరంలో నెతన్యాహూ కూటమి

మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 61 స్థానాల మద్దతు అవసరం. నెతన్యాహూ నేతృత్వంలోని రైట్-వింగ్ బ్లాక్ 53 సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలవగా, ఆయనను గద్దె దించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్ కూటమి 48 స్థానాలకే పరిమితమైంది. దీంతో నెతన్యాహూ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

Israel Election Results Netanyahu Bloc Secures 53 Seats as Coalition Talks Begin For Majority Mark

అరబ్ పార్టీల చేతుల్లో కీలక సూత్రం

ఈ ఎన్నికల్లో అరబ్ పార్టీల కూటమి ఊహించని విధంగా 19 స్థానాలను గెలుచుకుని తుది ఫలితాన్ని శాసించే స్థాయికి చేరింది. ప్రతిపక్ష కూటమి 48 సీట్లకే పరిమితం కావడంతో, వారు అరబ్ పార్టీల మద్దతు కోరే దిశగా పావులు కదుపుతున్నారు. అయితే, నెతన్యాహూ చాకచక్యమైన వ్యూహాలు, మిత్రపక్షాలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం దృష్ట్యా వ్యతిరేక కూటమి కట్టడం ప్రతిపక్షాలకు అంత సులభం కాదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

నెతన్యాహు ప్లాన్-బీ అమల్లోకి..! విపక్ష నేతతో కలిసి ప్రభుత్వం? ఆఫర్స్ ఇవే..!
నెతన్యాహు ప్లాన్-బీ అమల్లోకి..! విపక్ష నేతతో కలిసి ప్రభుత్వం? ఆఫర్స్ ఇవే..!

మిత్రపక్షాల రాయబారాలు.. నెతన్యాహూ చదరంగం

అల్ట్రా ఆర్థడాక్స్ యూదు వర్గానికి చెందిన కొన్ని కీలక పార్టీలు తమ డిమాండ్ల ఆధారంగా మద్దతు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. సైనిక సేవ నుంచి తమ వర్గానికి మినహాయింపు ఇచ్చే చట్టం కోసం ఇవి పట్టుబడుతున్నాయి. ఈ ప్రతిపాదనలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సిద్ధహస్తుడైన నెతన్యాహూ, త్వరలోనే అవసరమైన 8 సీట్ల మద్దతును కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ధీమా ఆయన మద్దతుదారుల్లో కనిపిస్తోంది.

ఓట్ల లెక్కింపు ఆరోపణలు.. దర్యాప్తుకు డిమాండ్

ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయంటూ లికుడ్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, నకిలీ పత్రాలతో ఓట్లు వేయించడం వంటి చర్యలు జరిగాయని పేర్కొంటూ సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ చేసింది. అంతేకాకుండా, విదేశీ శక్తుల ప్రమేయంపై వస్తున్న వార్తలను ఆయా విదేశీ ప్రతినిధులు, అరబ్ పార్టీలు ఖండించాయి.

Israel Elections: ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది? ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?
Israel Elections: ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది? ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?

నెతన్యాహూ చేతికే మళ్లీ పగ్గాలు?

తుది అధికారిక ఫలితాలు వెలువడిన తర్వాత అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పీఎం అభ్యర్థిని ఆహ్వానిస్తారు. ప్రభుత్వం ఏర్పాటుకు 42 రోజుల సమయం లభిస్తుంది. ఒకవేళ ఏ కూటమికీ స్పష్టత రాకపోతే దేశం మరోసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే, సుదీర్ఘ రాజకీయ అనుభవం, సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న నెతన్యాహూనే మళ్లీ ఇజ్రాయెల్ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయా విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+